ప్యారిస్‌లోని ఖతార్ ఎంబసీలో సెక్యూరిటీ గార్డ్ హత్య

- May 23, 2022 , by Maagulf
ప్యారిస్‌లోని ఖతార్ ఎంబసీలో సెక్యూరిటీ గార్డ్ హత్య

ఖతార్: ప్యారిస్‌లోని ఖతార్ ఎంబసీ వద్ద సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక ఎలాంటి తీవ్రవాద లింకులూ లేవని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన అత్యంత దారుణమని ఖతార్ ఎంబసీ పేర్కొంది. ఘటనపై విచారణ జరుగుతోందనీ, విచారణలో అన్ని విషయాలూ వెలుగు చూస్తాయని ఖతార్ ఎంబసీ వివరించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఘటన గురించి ప్రస్తావించింది ప్యారిస్‌లోని ఖతార్ ఎంబసీ. మృతుడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి కూడా తెలిపింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఇంకా గుర్తించాల్సి వుందని ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్స్ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com