భారత దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించిన రక్షా సెక్యూరిటీ సొల్యూషన్స్
- May 24, 2022
GMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (GIL) యొక్క ప్రీమియర్ సెక్యూరిటీ కంపెనీ అయిన RAXA సెక్యూరిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో రక్తదాన శిబిరాలను నిర్వహించింది. ఈ రక్తదాన శిబిరాలలో RAXA బృంద సభ్యులతో పాటు GMR బిజినెస్ సర్వీసెస్ నుండి సీనియర్ అధికారులు పాల్గొని 1000 యూనిట్లకు పైగా రక్తాన్ని అందించారు. RAXAతో కలిసి పనిచేస్తున్న అనేక ఇతర సంస్థలు కూడా ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని 200 యూనిట్ల కంటే ఎక్కువ రక్తాన్ని దానం చేశాయి.
ఈ సందర్భంగా RAXA CEO GUG శాస్త్రి మాట్లాడుతూ, “రక్తం కొరత కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నారు. విలువైన ప్రాణాలను కాపాడేందుకు సురక్షితమైన రక్తాన్ని దానం చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, RAXA దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించింది. దీనికి చాలా మంచి ప్రతిస్పందన వచ్చింది. ఈ మానవతా కారణం కోసం ముందుకు వచ్చిన మా RAXA సిబ్బంది, ఇతరులను మేం అభినందిస్తున్నాము. సమాజానికి మా వంతుగా, రాబోయే రోజుల్లో ఇలాంటి శిబిరాలను మరిన్ని నిర్వహించాలని మేము భావిస్తున్నాము.’’
ఈ ఉదాత్తమైన కార్యానికి మద్దతునిస్తూ లయన్స్ క్లబ్ బెంగుళూరు వైష్ణవి; తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ; వుప్పాల వెంకయ్య మెమోరియల్ బ్లడ్ బ్యాంక్, హైదరాబాద్; డా.హెడ్గేవార్ బ్లడ్ బ్యాంక్, నాగ్పూర్; స్వామి వివేకానంద బ్లడ్ బ్యాంక్, బెంగళూరు సౌత్; లయన్స్ బ్లడ్ బ్యాంక్, ఢిల్లీ వంటి ప్రముఖ సంస్థలు మరియు జిల్లా బ్లడ్ బ్యాంకులు వివిధ ప్రదేశాలలో రక్త శిబిరాలు నిర్వహించాయి.
ప్రజలకు సేవ చేయాలనే అచంచలమైన నిబద్ధతతో, RAXA సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్, భారతదేశం అంతటా దానోత్సవ్, స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాలు, చెట్ల పెంపకం వంటి వివిధ CSR కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
రక్షా అనేది వన్-స్టాప్ సర్వీస్ ప్రొవైడర్. ఇది విమానాశ్రయాలు, పవర్ ప్లాంట్లు, హైవే టోల్ ప్లాజాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, IT, విద్యా సంస్థలు మరియు మరెన్నో కీలకమైన ఇన్స్టాలేషన్ల కోసం సెక్యూరిటీ సేవలను అందిస్తోంది.తక్కువ ఖర్చుతో కస్టమైజ్డ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోరుకునే క్లయింట్ల అవసరాలను తీర్చడానికి మొత్తం సమగ్రమైన భద్రతా వ్యవస్థను అందించడానికి రక్షా కట్టుబడి ఉంది.
_1653402260.jpg)
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







