మక్కాలో హైదరాబాద్ వాసి మృతి..
- May 24, 2022
జెడ్డా: సౌదీ అరేబియా లోని మక్కాలో విషాద ఘటన చోటు చేసుకుంది.హైదరాబాద్ కు చెందిన ఎన్నారై ప్రమాదవశాత్తు ఓ భవనం మీది నుంచి పడి మృతి చెందాడు.ఈ ఘటన ఆదివారం (మే 22న) జరిగింది.మృతుడిని మొహిద్దీన్ అజీజ్ గా గుర్తించారు.అతని స్వస్థలం హైదరాబాద్ లోని యాకుత్ పురా.గత పదేళ్ల నుంచి సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు.జెడ్డాలోని అజిజియా ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు.
మక్కాలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు.ఎప్పటిలాగే ఆదివారం కూడా డ్యూటీకి వెళ్లిన అజీజ్ పనిచేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు.ఇక ఈ ఘటనపై భారత కాన్సులేట్, లోకల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఖననం చేయనున్నట్లు అజీజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







