దేశం విడిచి వెళ్లే ముందు జరిమానా చెల్లించేలా చట్టం.. ప్రతిపాదించిన కువైట్ ఎంపీ

- May 25, 2022 , by Maagulf
దేశం విడిచి వెళ్లే ముందు జరిమానా చెల్లించేలా చట్టం.. ప్రతిపాదించిన కువైట్ ఎంపీ

కువైట్: దేశం నుండి బయటికి వెళ్లే ముందు నివాసితులు అన్ని జరిమానాలు చెల్లించాలని కోరుతూ పార్లమెంటేరియన్ ఒసామా అల్-మానవర్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఎంపీ తన ప్రతిపాదనలో నివాసితులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన సేవలకు రుసుము, ఆర్థిక జరిమానాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు మొదలైనవాటిని చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ నివాస చట్టానికి సవరణలు చేయాలని అభ్యర్థించారు. అతని ప్రతిపాదన ప్రకారం.. జీసీసీ నివాసితులు, రాయబార కార్యాలయాల దౌత్యవేత్తలు, కువైట్ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నవారు ఈ ప్రతిపాదన నుండి మినహాయించబడ్డారు. దేశ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతర వర్గాలను మినహాయించవచ్చని ఆయన తన ప్రతిపాదనలో పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com