అమెరికాలో మళ్లీ కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి..
- May 25, 2022
టెక్సాస్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.టెక్సాస్‌లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు నాలుగు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వెల్లడించారు.మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగులు చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
దీంతో వెంటనే స్థానిక పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి. దుండగుడు తన కారును వదిలేసి రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించాడు అని, తన వద్ద తుపాకీతో పాటు రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని గవర్నర్ తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది కంటే ఎక్కువే విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపింది..స్థానికంగా నివసించే యూఎస్ పౌరుడు సాల్వడార్ రామోస్ అని అనుమానిస్తున్నారు.అతను కూడా పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయాడని గవర్నర్ చెప్పారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







