మెగా ఫ్యామిలీకి గుడ్ బై చెప్పేసి, అల్లు అర్జున్ వేరు కుంపటి పెట్టేశాడా.?

- May 25, 2022 , by Maagulf
మెగా ఫ్యామిలీకి గుడ్ బై చెప్పేసి, అల్లు అర్జున్ వేరు కుంపటి పెట్టేశాడా.?

స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అనే బిరుదులున్నా, మెగా ఫ్యామిలీ హీరోగానే అల్లు అర్జున్ కెరీర్ స్టార్ట్ చేశాడు. అయితే, అనూహ్యంగా పెరిగిన స్టార్‌డమ్‌తో చాలా కాలంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి తప్పుకుని, వేరు కుంపటి ప్లాన్ చేస్తున్నాడన్న ప్రచారం గట్టిగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆ నేపథ్యంలోనే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ.. అంటూ మధ్యలో అడ్డుగోడలు లేచాయి. అదలా వుంటే, తాజాగా అల్లు అర్జున్‌ గురించి మరో కొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యామిలీ లేదు, అల్లు ఫ్యామిలీ లేదు. నందమూరి ఫ్యామిలీతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయ్.

అసలెందుకిదంతా.? మొన్న ‘అఖండ’ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్‌లు ముఖ్య అతిధులుగా వచ్చి, బాలయ్య బాబును స్టేజ్ మీద పొగడ్తలతో ముంచెత్తేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంకాస్త ముందుకెళ్లి నందమూరి ఫ్యామిలీతో అల్లు అర్జున్ ఏవేవో మంతనాలు చేస్తున్నారనీ తెలుస్తోంది.

గతంలోనూ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని లైట్ తీసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడనుకోండి. కానీ అవేమీ పారలేదు. ‘పుష్ప’ సెన్సేషనల్ హిట్ కొట్టడంతో, మళ్లీ ఆ ప్రయత్నాలకు ఊపిరి పోస్తున్నాడనీ మాట్లాడుకుంటున్నారు.

ఏది ఏమైనా ఇదంతా మెగా ఫ్యామిలీ నుంచి దూరం కావడానికే అనేది సోషల్ మీడియా ప్రచారాల సారాంశం. ‘ఏం పీకలేరు బ్రదర్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ఒకటి బన్నీ ఫ్యాన్స్ నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి ఇన్ డైరెక్టుగా బన్నీ ఫ్యాన్స్ విసురుతున్న సవాల్‌లో భాగంగా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com