అక్కినేని కాంపౌండ్‌లో బిందు మాధవి.?

- May 25, 2022 , by Maagulf
అక్కినేని కాంపౌండ్‌లో బిందు మాధవి.?

బిగ్‌బాస్ విన్నర్‌గా బిందు మాధవి సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో పెద్ద తెరపై పెద్దగా సక్సెస్ అయిన ముద్దుగుమ్మలెవరూ లేరింతవరకూ. కానీ, ఆ లోటు కూడా బిందు మాధవి తీర్చేసేలా వుంది. బిగ్‌బాస్ ఫేమ్‌తో బిందు మాధవికి ఆఫర్లు క్యూ కడుతున్నాయట.

ఆల్రెడీ హీరోయిన్‌గా గతంలో సత్తా చాటిన బిందు మాధవి, ఇకపై వెండితెరపై సూపర్ సక్సెస్ బాటలో పయనించబోతోందట. తెలుగులో ఇప్పటికే అక్కినేని కాంపౌండ్ నుంచి ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసిందట. అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాలో బిందు మాధవి ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

హీరోయిన్‌గా మంచి పొటెన్షియాలిటీ వున్న తెలుగమ్మాయ్ బిందు మాధవి. ఆ విషయం ఆమె గత చిత్రాలైన ‘ఆవకాయ్ బిర్యానీ’, ‘బంపర్ ఆఫర్’ తదితర చిత్రాల ద్వారా ప్రూవ్ అయ్యింది.

అలాగే, తమిళంలోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా సత్తా చాటింది బిందు మాధవి. చూస్తుంటే, బిగ్‌బాస్ పుణ్యమా అని, ఈ సారి బిందు మాధవి కెరీర్‌కి ఎలాంటి ఢోకా లేదనిపిస్తోంది. ఓ వైపు తెలుగులోనూ, మరోవైపు తమిళంలోనూ కూడా క్రేజీ ఆఫర్లు తన ఖాతాలో వేసుకోబోతుందట బిందు మాధవి.

సో, ఈ రకంగానూ మన తెలుగమ్మాయ్ సెన్సేషన్ క్రియేట్ చేయనుందన్న మాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com