సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభించిన బహ్రెయిన్ టూరిజం
- May 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి గురించి పర్యాటకులు ఈ గైడెడ్ టూర్ల ద్వారా సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ టూర్లు ప్రత్యేకమైన అనుభూతిని పర్యాటకులకు అందిస్తాయి. ఏళ్ళ తరబడి మల్టీ కల్చరల్ కమ్యూనిటీస్ ఇక్కడ వర్ధిల్లుతున్న తీరుని పర్యాటకులు సవివరంగా తెలుసుకోవచ్చు. బాబ్ అల్ బహ్రెయిన్ ప్రాంతం నుంచి లైసెన్సు పొందిన గైడ్లు టూరిస్టులకు అందుబాటులో వుంటారు. మే 26 నుంచి శని మరియు బుధవారాల్లో ప్రత్యేకంగా ఈ టూర్లు వుంటాయి. పుడ్ డైవర్సిటీ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. అథారిటీ వెబ్సైట్ ద్వారా టూర్లను బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







