జులై 4న ఏపీకి ప్రధాని మోడీ
- May 29, 2022
న్యూ ఢిల్లీ: భారత ప్రధాని మోడీ..జులై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్టు ఆ పార్టీ ఆకివీడు మండల కమిటీ అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు తెలిపారు. భీమవరంలో నిర్వహించనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొనబోతున్నట్లు సమాచారం. జూన్ 7న రాజమహేంద్రవరంలో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటారని తెలుస్తుంది.
ప్రస్తుతం బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల ఫై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ లకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. రీసెంట్ గా మోడీ తెలంగాణ లో పర్యటించారు. హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొని , కేసీఆర్ సర్కార్ తీరు ఫై విమర్శలు చేసారు. “కుటుంబ పార్టీలు కేవలం వారి సొంత అభివృద్ధి కోసమే ఆలోచిస్తాయి. పేదల ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవు. కేవలం ఒక్క కుటుంబమే అధికారంలో ఎలా ఉండాలి? ప్రజలను ఎలా దోచుకోవాలి? అనే దానిపైనే వారి దృష్టి ఉంటుంది. అంతేతప్ప ప్రజల అభివృద్ధి గురించి అస్సలు ఆలోచించరు. ఇలాంటి కుటుంబ పార్టీలను తరిమిస్తేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కేంద్ర పథకాల పేరు మార్చి తెలంగాణ ప్రజలను ఏమారుస్తున్నారు. ” అని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.ముగ్గురు కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని తెలిపారు.తాము పారిపోయే వారం కాదని.. పోరాడేవారమని స్పష్టం చేశారు. కంప్యూటర్ యుగంలోనూ కొందరు మూఢమ్మకాలను పాటిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు తెలంగాణకు న్యాయం చేయలేరని విమర్శించారు.మోడీ వ్యాఖ్యల ఫై టీఆరఎస్ పార్టీ నేతలు సైతం కౌంటర్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏపీ లో ఇలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







