ఐపీఎల్ కప్ కైవసం చేసుకున్న గుజరాత్

- May 29, 2022 , by Maagulf
ఐపీఎల్ కప్ కైవసం చేసుకున్న గుజరాత్

అహ్మదాబాద్: ఐపీఎల్2022 లో నయా జట్టు గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది. అరంగేట్ర సీజన్‌లోనే ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.ఎలాంటి అంచనా లేకుండానే  ఎంట్రీ ఇచ్చి చాంఫియన్‌గా అవతరించింది. ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించి విజేతగా  నిలిచింది. ప్రత్యర్థి నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలివుండగానే  చేధించింది.గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. పరుగులు నియంత్రించడంలో రాజస్థాన్ బౌలర్లు కొంతవరకు సఫలీకృతమయ్యారు. అయితే గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, శుభమన్‌గిల్ చక్కటి భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. చాహాల్ బౌలింగ్ బౌలింగ్‌లో పాండ్యా వెనుదిరిగినా.. ఆ తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన డేవిడ్ మిల్లర్.. శుభ్‌మన్ గిల్ సహాయంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కాగా అంతకుముందు టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడారు. పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. బట్లర్ (39) మాత్రమే ఫర్వాలేదనిపించాడు.

గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్:వృద్ధిమాన్ సాహా(5), శుభ్‌మన్ గిల్(45 నాటౌట్), మాథ్యూవేడ్(8), హార్ధిక్ పాండ్యా(34), డేవిడ్ మిల్లర్(32) చొప్పున పరుగులు చేశారు.


రాజస్థాన్ బౌలింగ్:ట్రెంట్ బౌల్ట్ 1, ప్రసిధ్ కృష్ణ 1, చాహాల్ 1 చొప్పున వికెట్లు తీశారు. కీలక మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లు వేసి 27 పరుగులు సమర్పించుకున్నాడు.
రాజస్థాన్ బ్యాటింగ్..యశ్వస్వి జైస్వాల్ (22), జాస్ బట్లర్(39), సంజూ శాంసన్(14), దేవధూత్ పడిక్కల్(2), హెట్మేయర్(11), రవిచంద్రన్ అశ్విన్(6), రియాన్ పరాగ్(15), ట్రెంట్ బౌల్ట్(11), మెక్‌కే(8), ప్రిసిద్ కృష్ణ(0, నాటౌట్)  చొప్పున పరుగులు చేశారు.

గుజరాత్ సూపర్ బౌలింగ్:గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లను నిలువరించారు.గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 4 ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే అత్యంత కీలకమైన 3 వికెట్లు తీశాడు. రవిశ్రీనివాసన్ సాయి కిశోర్ 2 వికెట్లు, మొహమ్మద్ షమీ, యస్ దయాల్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com