ఇరాక్‌ను వణికిస్తోన్న ప్రాణాంతక కాంగో ఫీవర్
- May 30, 2022
ఇరాక్: కాంగో ఫీవర్‌తో ఇరాక్ వణుకుతోంది. దేశంలో ఇటీవల ఈ కేసులు భారీగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఈ ఏడాది ఇప్పటి వరకు 19 మంది కాంగో ఫీవర్ బారినపడి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ కాంగో ఫీవర్ సోకితే జ్వరం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.
నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ అనే రక్తం పీల్చే పేలు ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మానవులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇరాక్‌లో 1979లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం, గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







