క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో GMRIT విద్యార్థుల రాణింపు

- May 30, 2022 , by Maagulf
క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో GMRIT విద్యార్థుల రాణింపు

విశాఖపట్నం: GMR వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) ఆధ్వర్యంలో స్థాపించబడిన GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMRIT) విద్యార్థులు ఇటీవల ముగిసిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో మరోసారి రాణించారు. 180% ఆఫర్‌లతో GMRIT విద్యార్థులు పలురకాల ప్యాకేజీలతో  ప్రముఖ బహుళజాతి కంపెనీలలో అధిక వేతనాలతో ఉద్యోగాలను పొందారు.

GMRIT ఈ సంవత్సరం 1100+ ప్లేస్‌మెంట్ ఆఫర్‌లను నమోదు చేసింది, గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఆఫర్‌లలో 60% పెరుగుదల ఉంది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, వాల్యూల్యాబ్స్, TCS, Wipro, Accenture, Paytm మరియు L&T రిక్రూటర్లలో అగ్రస్థానంలో ఉన్నాయి.

దీనిపై GMRIT ప్రిన్సిపల్ డాక్టర్ సి.ఎల్.వి.ఆర్.ఎస్.వి. ప్రసాద్, “అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలు, సాంకేతికతను నేర్చుకునేలా ప్రోత్సహించి GMRIT విద్యార్థులు భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండేలా చేస్తుంది. మా పాఠ్యప్రణాళికలు, శిక్షణా కార్యక్రమాలు వారు ఉపాధిని పొందేలా మాత్రమే కాకుండా వారిలో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ దృక్పథాన్ని పెంచుతాయి. సింపోజియంలు, టెక్ ఫెస్ట్‌లు, హ్యాకథాన్‌ల ద్వారా GMRITలో పొందే ఎక్స్‌పోజర్‌తో విద్యార్థులు తమ రంగాలలో రాణిస్తారని మేం విశ్వసిస్తున్నాం. విద్యార్థుల కెరీర్ మార్గానికి సరైన దిశానిర్దేశం చేయడానికి, వారి కలలను నిజం చేయడానికి GMRIT ప్రయత్నిస్తుంది.’’ అన్నారు.

GMRIT యొక్క అంతర్జాతీయ కొలాబరేటివ్ ప్రోగ్రాములు పరిశ్రమ అవసరాలను తీర్చి, గ్రాడ్యుయేట్‌లను పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా చేస్తాయి. GMRIT యొక్క శిక్షణ, ప్లేస్‌మెంట్, డెవలప్‌మెంట్ సెల్ విద్యార్థులను పరిశ్రమలతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం విద్యార్థులను సిద్ధం చేస్తుంది, రిక్రూట్‌మెంట్ అవకాశాల గురించి కంపెనీలకు అవగాహన కల్పిస్తుంది. సెమినార్‌ల నిర్వహణ, గ్రూప్ డిస్కషన్‌లు, రాత పరీక్షలతో విద్యార్థులకు నిర్మాణాత్మక మద్దతు కూడా ఇవ్వబడుతుంది.

అంతర్జాతీయంగా ప్రమాణాలు కలిగిన GMRIT ఉన్నత సాంకేతిక విద్యను గ్రామీణ యువతకు అందజేస్తుంది. అనుభవజ్ఞులైన, నిబద్ధత కలిగిన అధ్యాపకుల ఆధ్వర్యంలో, GMRIT విద్యార్థులకు మూడో సెమిస్టర్ నుండి వివిధ సాంకేతిక, సాంకేతికేతర శిక్షణను అందిస్తారు. పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాల నుండి నిపుణులను ఆహ్వానించడం ద్వారా వివిధ సెమినార్లు, సాంకేతిక చర్చలను కూడా GMRIT నిర్వహిస్తుంది. NIRF 2020 & 2021లో విడుదల చేసిన ర్యాంక్ బ్యాండ్‌లో GMIRT 201-250 స్థానాల మధ్య ఉంది. 2022 సంవత్సరానికి 'డేటా క్వెస్ట్' GMRITని భారతదేశంలోని టాప్ T పాఠశాలల్లో ఒకటిగా పేర్కొనగా (భారతదేశం ర్యాంక్: 28 / AP రాష్ట్రం ర్యాంక్: 03), 'ఎడ్యుకేషన్ వరల్డ్' అత్యుత్తమ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఒకటిగా (భారతదేశం ర్యాంక్ : 33 / AP స్టేట్ ర్యాంక్ : 01) పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com