విద్యాబాలన్ పేరు చెబితే వద్దు బాబోయ్ అంటున్నారు
- May 30, 2022
బాలీవుడ్ భామ విద్యా బాలన్ అంటే మంచి నటి గుర్తుకొస్తుంది. అదే టైమ్‌లో ‘డర్టీ పిక్చర్’ వంటి బోల్డ్ సినిమాలు కూడా గుర్తొస్తాయ్. ఒకప్పుడు సన్నగా నైస్‌గా వుండే విద్యా బాలన్ ఇప్పుడు బొద్దుగా తయారైపోయింది. హీరోయిన్ కదా.. అంత బొద్దుగా వుంటే ఎలా.? తగ్గమని చాలా మంది సలహాలిచ్చారట విద్యా బాలన్‌కి.
కానీ, విద్యా బాలన్ వాళ్ల మాటలు పట్టించుకోలేదు. వయసుతో పాటు, తన శరీరంలో వచ్చిన మార్పుల్ని గౌరవించింది. అనవరసరమైన వర్కవుట్లు చేసి, లేదా బాడీని తగ్గించుకునేందుకు డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల సర్జరీలను ఆశ్రయించడం వంటి యవ్వారాల జోలికి అస్సలు పోలేదు విద్యా బాలన్.
అయినా ఆమెకి అవకాశాలకేం కొదవ లేదు. హీరోయిన్గా ఎప్పుడూ బిజీనే. ఆ మధ్య ఎన్టీయార్ బయోపిక్ ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ సినిమా డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయిందనుకోండి. ఏరి కోరి విద్యా బాలన్‌ను ఆ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. కానీ, సినిమా దారుణమైన ఫలితాన్ని చవి చూడాల్సి వచ్చింది.
సరే, ఇప్పుడీ ముచ్చట ఎందుకంటారా.? విద్యా బాలన్ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయట. సీనియర్ హీరోల కోసం విద్యా బాలన్‌ను పరిశీలిస్తున్నారట. తెలుగులో ఓ పక్క హీరోయిన్ల కొరత, మరోపక్క బాలయ్య, చిరంజీవి, వెంకీ వంటి స్టార్ హీరోల హవా.. వాళ్ల సరసన నటించేందుకు ఆ స్ట్రీటజీ వున్న సీనియర్ హీరోయిన్లు తెలుగులో లేకపోవడంతో విద్యా బాలన్ తదితర సీనియర్ బాలీవుడ్ ముద్దుగుమ్మల వైపు తెలుగు మేకర్ల దృష్టి మళ్లుతోందట.
అవును నిజమే, విద్యాబాలన్ అయితే చాలా బాగుంటుంది. కానీ, తెలుగు డెబ్యూ మూవీ రిజల్ట్‌తో విద్యా బాలన్ అంటే వద్దు బాబోయ్ అంటున్నారట ఓ వర్గం ఆడియన్స్. సినిమా ఫ్లాప్ అయ్యిందంటే అందుకు కారణం కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. అలాంటిది అదొక్కటే ప్రామాణికంగా తీసుకుని విద్యా బాలన్ని వద్దనడం ఎంతవరకూ సబబు.?
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







