ఆ ఒక్కటీ అడగొద్దంటున్న నజ్రియా ఫహాద్
- May 30, 2022
అప్పుడెప్పుడో ‘రాజా రాణి’ అను డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయస్తురాలు నజ్రియా ఫహాద్. బబ్లీ క్యారెక్టర్‌లో కనిపించి, ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం బాగా ఎట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ, ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది హీరోయిన్‌గా ఈ అమ్మడు.
అందుకేనేమో, పెళ్లయ్యి, పిల్లలున్నా ఇన్నేళ్ల తర్వాత కూడా నజ్రియాకి హీరోయిన్ అన్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా తెలుగులో ‘అంటే సుందరానికి’ సినిమాలో నజ్రియా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నజ్రియా.. ఇప్పుడొస్తుందే.. అదేంటీ. తెలుగులో హీరోయిన్లు లేరా.? అని అందరూ అవాక్కయ్యారు.
కానీ, ఆ సినిమాలో ‘లీల’ పాత్రకు కేవలం నజ్రియా అయితేనే బాగుంటుందని భావించి ఆమెని ఒప్పించి తీసుకొచ్చారట. ఆ పాత్రకు నజ్రియానే తీసుకోవడానికి ఓ పెద్ద రీజన్ కూడా వుందట. ఆ రీజన్ మాత్రం సినిమా చూశాకే తెలుస్తుందంటోంది చిత్ర యూనిట్. ఇక, సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్లలో నజ్రియా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఫ్యాన్స్‌తో పంచుకుంది.
క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమాలో అయినా నటిస్తాను.. భాషతో సంబంధం లేదు. కానీ, గ్లామర్ తన ఒంటికి అస్సలు పడని విషయం అని నిక్కచ్చిగా కుండ బద్దలుకొట్టేసింది నజ్రియా. ‘అంటే సుందరానికి’ తర్వాత ఇంకా సినిమాల్లో నటిస్తారా.? అని అడిగితే, మంచి ఛాన్సులొస్తే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది నజ్రియా.
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘అంటే సుందరానికి’ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతవరకూ రిలీజైన ఈ సినిమా పోస్టర్లూ, ప్రోమోలను చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా రూపొందించారు. దాంతో సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. చూడాలి మరి, రిలీజ్ తర్వాత ఆ అంచనాల్ని అందుకుంటుందో లేదో ‘అంటే సుందరానికి’.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







