బంపర్ ఛాన్స్ కొట్టేసిన విష్ణు ప్రియ: కల నెరవేరిందిగా
- May 31, 2022
‘వాంటెడ్ పండుగాడ్’ అనే టైటిల్‌తో ఓ సినిమాకి సంబంధించి ఈ మధ్య ఓ పోస్టర్ విడుదల చేశారు. అనసూయ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అది. అయితే, ఆ సినిమాలో హీరోయిన్ అనసూయ కాదు. ఇంపార్టెంట్ రోల్లో అనసూయ నటిస్తోంది.
అసలు ఆ సినిమాలో హీరోయిన్ విష్ణు ప్రియ. బుల్లితెర మరో హాట్ సెన్సేషన్ ఈ ముద్దుగుమ్మ. నిజానికి విష్ణు ప్రియ మెయిన్ టార్గెట్ బుల్లితెర కాదట. పెద్ద తెరపై హీరోయిన్ అవ్వాలన్నది ఆమె డ్రీమ్ అట. ఆ డ్రీమ్ ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాతో తీరిందంటోంది విష్ణుప్రియ.
బుల్లితెర పైనే కాదు, సోషల్ మీడియా తెర పైనా విష్ణు ప్రియ హాట్ ఫేవరేటే. ఇన్‌స్టా వేదికగా హాట్ హాట్ డాన్సు పర్ఫామెన్సులిస్తూ, ఫాలోవర్స్‌ని ఫుల్ ఖుషీ చేస్తుంటుంది విష్ణు ప్రియ. ఇక తాజా విషయానికొచ్చేద్దాం.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ అంటే ఆ కిక్కే వేరప్పా. ఒక్కసారైనా ఆయన సినిమాలో నటించాలని ఉర్రూతలూగుతుంటారు ముద్దుగుమ్మలు. ఆ కల ఇప్పుడు విష్ణుప్రియకు ఇలా నెరవేరిపోయిందన్నమాట.
అన్నట్లు ఓటీటీ తెరపై ఆల్రెడీ విష్ణు ప్రియ హీరోయిన్ మోజు తీర్చేసుకుంది. పలు వెబ్ సిరీస్‌లలో విష్ణు ప్రియ హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంది. ఇక పెద్ద తెరపై లక్ చెక్ చేసుకోవడమే మిగిలి వుంది. ఇక ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్నాడు. యూట్యూబ్ సెన్సేషన్ దీపికా పిల్లి మరో హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







