బంపర్ ఛాన్స్ కొట్టేసిన విష్ణు ప్రియ: కల నెరవేరిందిగా

- May 31, 2022 , by Maagulf
బంపర్ ఛాన్స్ కొట్టేసిన విష్ణు ప్రియ: కల నెరవేరిందిగా

‘వాంటెడ్ పండుగాడ్’ అనే టైటిల్‌తో ఓ సినిమాకి సంబంధించి ఈ మధ్య ఓ పోస్టర్ విడుదల చేశారు. అనసూయ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అది. అయితే, ఆ సినిమాలో హీరోయిన్ అనసూయ కాదు. ఇంపార్టెంట్ రోల్‌లో అనసూయ నటిస్తోంది.

అసలు ఆ సినిమాలో హీరోయిన్ విష్ణు ప్రియ. బుల్లితెర మరో హాట్ సెన్సేషన్ ఈ ముద్దుగుమ్మ. నిజానికి విష్ణు ప్రియ మెయిన్ టార్గెట్ బుల్లితెర కాదట. పెద్ద తెరపై హీరోయిన్ అవ్వాలన్నది ఆమె డ్రీమ్ అట. ఆ డ్రీమ్ ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాతో తీరిందంటోంది విష్ణుప్రియ.

బుల్లితెర పైనే కాదు, సోషల్ మీడియా తెర పైనా విష్ణు ప్రియ హాట్ ఫేవరేటే. ఇన్‌స్టా వేదికగా హాట్ హాట్ డాన్సు పర్‌ఫామెన్సులిస్తూ, ఫాలోవర్స్‌ని ఫుల్ ఖుషీ చేస్తుంటుంది విష్ణు ప్రియ. ఇక తాజా విషయానికొచ్చేద్దాం.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ అంటే ఆ కిక్కే వేరప్పా. ఒక్కసారైనా ఆయన సినిమాలో నటించాలని ఉర్రూతలూగుతుంటారు ముద్దుగుమ్మలు. ఆ కల ఇప్పుడు విష్ణుప్రియకు ఇలా నెరవేరిపోయిందన్నమాట.

అన్నట్లు ఓటీటీ తెరపై ఆల్రెడీ విష్ణు ప్రియ హీరోయిన్ మోజు తీర్చేసుకుంది. పలు వెబ్ సిరీస్‌లలో విష్ణు ప్రియ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకుంది. ఇక పెద్ద తెరపై లక్ చెక్ చేసుకోవడమే మిగిలి వుంది. ఇక ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్నాడు. యూట్యూబ్ సెన్సేషన్ దీపికా పిల్లి మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com