త్రివిక్రమ్ - వెంకటేష్: మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా.?
- May 31, 2022
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పంచ్ డైలాగులు రాయడమే కాదు, సామాజిక బాధ్యత కూడా ఆయన డైలాగుల్లో కనిపిస్తుంటుంది. సరే, సామాజిక బాధ్యత పక్కన పెడితే, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ పల్స్ పట్టుకోవడంలో ఆయన ధిట్ట.
ఆయన సినిమాలు అంతలా సక్సెస్ కావడానికి కారణం కూడా అదే. మాటల రచయితగా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ఫిలిం మేకింగ్‌లో రింగ్ మాస్టర్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సి వుంది.
త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఆ తర్వాత ఎన్టీయార్‌తో చేయాల్సిన సినిమా ఒకటి వుంది. తాజాగా త్రివిక్రమ్ లిస్టులో వెంకటేష్ కూడా చేరిపోయారు. మాటల రచయితగా వున్నప్పుడు వెంకటేష్‌తో కలిసి ‘మల్లీశ్వరి’ సినిమాలో భాగస్వామ్యం పంచుకున్నారాయన.
ఆ సినిమా అప్పడూ ఇప్పుడూ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అంతే. అందుకు బలమైన కారణం త్రివిక్రముడి మాటలే అనడం అతిశయోక్తి కాదు. వెంకీ బాడీ లాంగ్వేజ్‌కి త్రివిక్రముడి మాటలు చాలా చాలా బలం చేకూర్చాయి. మాటలతోనే వెంకీని అంతలా హైలైట్ చేశాడంటే, ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్‌లో వెంకటేష్ సినిమా ఏ స్థాయిలో వుంటుందో ఆలోచించుకుంటేనే హిట్టు బొమ్మ కళ్ల ముందట ప్రత్యక్షమయిపోతుంది.
ఎప్పటి నుంచో ఈ కాంబో సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయ్. కానీ, కుదరలేదు. ఇక ఇప్పుడు టైమొచ్చినట్లుంది. ‘ఎఫ్ 3’ హిట్ కొట్టి వున్న వెంకీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయిపోయినట్లే అని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమాని సురేష్ బాబు నిర్మించనున్నాడనీ తెలుస్తోంది. మహేష్ సినిమా పూర్తి కాగానే వెంకీ సినిమాని ట్రాక్‌లోకి తీసుకురానున్నాడట త్రివిక్రమ్.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







