రౌడీతో బుట్టబొమ్మ: కాంబో కెవ్వు కేక.!

- May 31, 2022 , by Maagulf
రౌడీతో బుట్టబొమ్మ: కాంబో కెవ్వు కేక.!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దూకుడు మామూలుగా లేదు. మొన్నీ మధ్యనే ‘లైగర్’ సినిమా పూర్తి చేశాడు. ఆ వెంటనే ‘ఖుషి’ సినిమాని పట్టాలెక్కించేశాడు. అప్పుడే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసేసుకుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు.

ఇటీవలే కాశ్మీర్ లోయల్లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమా తొలి షెడ్యూల్  షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది చిత్ర యూనిట్. తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. కాగా, ‘లైగర్’ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌తోనే విజయ్ దేవరకొండ ఇంకో సినిమా కూడా ఓకే చేసి పెట్టిన సంగతి తెలిసిందే.

అదే ‘జనగణమన’. పూరీ జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. పవన్ కళ్యాణ్‌తో చేయాలనుకున్నాడు కుదరలేదు. తర్వాత మహేష్ బాబును కూడా అనుకున్నాడు కానీ, అదీ కుదరలేదు. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ సెట్ అయ్యాడు. జూన్‌లో ఈ సినిమా లాంఛ్ కానుంది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నారట.

కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పేరు వినిపించింది. ఎప్పటి నుంచో తెలుగు ఎంట్రీ కోసం తర్జన భర్జన పడుతున్న జాన్వీ కపూర్, ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరిగింది. కానీ, తూచ్.!  అదంతా ఉత్తదే అని తేలిపోయింది.

ఆ తర్వాత రష్మిక పేరు కూడా వినిపించింది. కానీ, ఫైనల్‌గా పూజా హెగ్దే పేరు వినిపిస్తోంది. దాదాపు పూజా హెగ్దే ఫిక్సయ్యిందని అంటున్నారు. ఒకవేళ నిజమే అయితే, విజయ్ దేవరకొండ, పూజా హెగ్దే జంట చూడ చక్కగా వుంటుందని రౌడీ ఫ్యాన్స్ కూడా ఈ పెయిర్‌కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారట. సో, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే లేట్. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com