శ్రీవారి భక్తులకు అలర్ట్..
- May 31, 2022
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక విడుదల చేసింది. తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం బుధవారం (జూన్ 1) నుంచే అమల్లోకి రానున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించిన టీటీడీ… కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా పెట్టనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అలిపిరి టోల్గేట్ దగ్గరే తనిఖీలు చేయనున్నారు. అలిపిరి టోల్ గేట్ దగ్గర ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతిస్తామన్నారు. అలాగే కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఇప్పటికే ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్లు నిషేధించిన టీటీడీ.. రేపటి నుంచి పూర్తి స్తాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనుంది. చివరకు ఆట వస్తువులపై వచ్చే ప్లాస్టిక్ కవర్లపైనా బ్యాన్ విధించారు. షాంపూ ప్యాకెట్లు కూడా అనుమతించారు. కొండపై ఉన్న హోటళ్లు, దుకాణదారులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమావేశం అయ్యారు.జూన్ 1 నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నామని.. దుకాణదారులు, హోటళ్లు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామన్నారు. చివరికి షాంపూ ప్యాకెట్లు కూడా అమ్మకూడదని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు, దుకాణదారులు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







