BREAKING: ప్రముఖ గాయకుడు కేకే మృతి

- June 01, 2022 , by Maagulf
BREAKING: ప్రముఖ గాయకుడు కేకే మృతి

ప్రముఖ గాయకుడు  కృష్ణకుమార్ కున్నాత్ (KK) హఠాత్తుగా మరణించారు. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగర్ గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో హిట్‌లను అందించారు. కోల్‌కతాలో జరిగిన ఒక వేడుకలో ప్రత్యక్షంగా ప్రదర్శన ఇస్తుండగా ఆయ‌న కుప్ప‌కూలి మ‌ర‌ణించారు. 

దీంతో వెంట‌నే కేకేను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయ‌న అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్టు డాక్ట‌ర్లు ప్రకటించారు. కేకే త‌న ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోల‌ను అంత‌కు ముందు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KK (@kk_live_now)

కేకే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ గాయకుడిగా పేరుగాంచారు. KK హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ వంటి అనేక భాషలలో పాటలను పాడారు. ఆయ‌న‌కుఏ భార్య, పిల్లలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com