భారత్–బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ రైలు ప్రారంభం
- June 01, 2022
భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తూ..రెండు దేశాల మధ్య మరో కీలక అడుగు పడింది. భారత్‌లోని పశ్చిమబెంగాల్లోని న్యూ జలపాయ్‌గురి..నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా కంటోన్మెంట్ ఏరియాను కలుపుతూ ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ (ప్రజారవాణా) రైలు ప్రారంభం అయింది. బుధవారం భారత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ నూరుల్ ఇస్లాం సుజోన్‌లు బుధవారం ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు.ఈమేరకు బెంగాల్‌లోని న్యూ జలపాయ్‌గురి రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమాలో ఇరు దేశాల మంత్రులు పాల్గొన్నారు.న్యూ జలపాయ్‌గురి–ఢాకా కంటోన్మెంట్ మధ్య..బుధ, ఆదివారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
కాగా, ఇప్పటికే భారత్–బంగ్లాదేశ్ మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉండగా..బుధవారం మరో ప్రత్యేక రైలు ఇరుదేశాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఢాకా వరకు మైత్రీ రైలు, కోల్‌కతా నుంచి ఖుల్నా వరకు బంధన్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ భారత్‌లో 69 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లో 526 కిలోమీటర్లు ప్రయాణించనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







