సైనిక లాంఛనాలతో కేకే పార్థీవదేహానికి నివాళులు..
- June 01, 2022
కోల్‌కతా: కోల్‌కతాలో హఠాన్మరణం చెందిన పాపులర్ సింగర్ కేకే పార్దీవ దేహాన్ని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రి నుంచి ప్రభుత్వ లాంఛనాల నిమిత్తం రవీంద్రసదన్ కు తరలించారు. రవీంద్ర సదన్‌లో కేకే పార్ధీవదేహానికి సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు.జవాన్లు గాల్లోకి తూటాలు పేల్చగా..పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ తోపాటు కుటుంబసభ్యులు కేకే పార్థీవదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.
‘అద్బుతమైన టాలెంట్ ఉన్న యువ గాయకుడు కేకే ఆకస్మిక మృతి బాధాకరం.ఆయన గురించి ఏమి చెప్పగలను? ‘ అని సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కేకే ఆకస్మిక మరణంపై బాలీవుడ్ కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ మాట్లాడుతూ..ఇవాళ నా పుట్టినరోజు. ఈ రోజు కేకే లాంటి మంచి స్నేహితుడిని, ప్రతిభావంతులైన గాయకుడిని కోల్పోవడం నన్ను ఎంతో నిరుత్సాహపరుస్తుంది. కేకే చాలా మంచి మనిషి.నిజాయితీ గల వ్యక్తి. కేకేతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు.
కాగా, తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కేకే హఠాన్మరణం పట్ల సినీ, సంగీత ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. 53 ఏండ్ల కేకే కోల్‌కతాలో మంగళవారం రాత్రి మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత హోటల్ గదిలో కుప్పకూలిపోగా..వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







