సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
- June 02, 2022
హైదరాబాద్: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ ఒక్కరి కోసం న్యాయవ్యవస్థ పని చేయదని స్పష్టం చేశారు.న్యాయ వ్యవస్థ స్వార్థపరుల కోసం పనిచేసే వ్యవస్థ కాదని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థ లక్ష్యమన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల కోర్టులను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కోర్టు తీర్పులపై కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు.తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది దురదృష్టకరమన్నారు.
వ్యవస్థలను చక్కబెట్టుకోలేని వారు కోర్టులను తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్య మనుగడ సాగాలంటే న్యాయ వ్యవస్థ కీలకం అన్నారు. న్యాయ వ్యవస్థకు అందరూ మద్దతివ్వాలని తెలిపారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహణ పెరిగిందన్నారు. సంక్షేమ పాలన అందించడం రాజ్యాంగం కల్పించిన బాధ్యత అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధి కూడా అవసరం చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు కేసులు సత్వరం పరిష్కారమవుతున్నాయని తెలిపారు. సంక్షేమ పాలనే ధ్యేయంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు.చాలా ఏళ్ల తర్వాత న్యాయ వికేంద్రీకరణ జరిగిందన్నారు. 8 ఏళ్ల కింద అద్భుతమైన ఉద్యమం జరిగిందన్నారు. కొత్త రాష్ట్ర భవిష్యత్ పై గతంలో సందేహాలుండేవి..ఎనిమిదేళ్లలో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయని తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







