ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించనున్న టాటా గ్రూప్
- June 03, 2022
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనుంది టాటా గ్రూప్.ఈ కాంట్రాక్ట్‌ను టాటా గ్రూప్‌కు చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ విభాగం టాటా ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంది.
ఒప్పందంలో భాగంగా.. టాటా ప్రాజెక్ట్స్ విమానాశ్రయంలో టెర్మినల్, రన్‌వే, ఎయిర్‌సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, ల్యాండ్సైడ్ సౌకర్యాలు, ఇతర అనుబంధ భవనాలను నిర్మిస్తుందని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (YIAPL) శుక్రవారం ప్రకటన ద్వారా వెల్లడించింది.
యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ స్విస్ డెవలపర్ జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ AGకి 100 శాతం అనుబంధ సంస్థ, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్‌గా చేర్చారు.
2019లో, జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ AG విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే వేలాన్ని గెలుచుకుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిని ప్రారంభించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అక్టోబర్ 7, 2020న రాయితీ ఒప్పందంపై సంతకం చేసింది.
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయ్యాక ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది. 1,334 హెక్టార్లలో విస్తరించి ఉన్న గ్రీన్‌ఫీల్డ్ సదుపాయం, మొదటి దశలో ₹ 5వేల 700 కోట్ల పెట్టుబడితో సంవత్సరానికి 12 మిలియన్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల కెపాసిటీతో సింగిల్-రన్‌వే ఆపరేషన్‌ను కలిగి ఉంటుంది.
“నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణం చేపట్టేందుకు YIAPL టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ని ఎంపిక చేసింది. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, సేకరణ, నిర్మాణంలో అనుభవం ఉన్న మూడు షార్ట్‌లిస్ట్ చేసిన బృందాల నుంచి కంపెనీని ఎంపిక చేశారు” అని ఓ ప్రకటనలో పేర్కొంది.
కొత్త విమానాశ్రయం 2024 నాటికి పని చేస్తుందని భావిస్తున్నారు. EPC ఒప్పందం మూసివేయడంతో, విమానాశ్రయం మొదటి దశ రాయితీ వ్యవధి ప్రారంభమైన మూడు సంవత్సరాలలోపు YIAPL రెడీ చేస్తున్నట్లు తెలిపింది.
కంపెనీ, టాటా ప్రాజెక్ట్స్‌తో కలిసి, 2024 నాటికి ఏటా 12 మిలియన్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్యాసింజర్ టెర్మినల్, రన్‌వే, ఇతర విమానాశ్రయ మౌలిక సదుపాయాలను అందించడానికి కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







