ప్రవాసి మిత్ర 'భీంరెడ్డి'

- June 12, 2015 , by Maagulf
ప్రవాసి మిత్ర 'భీంరెడ్డి'

ప్రవాసి మిత్ర తెలుగు మాస పత్రిక ఎడిటర్‌ భీంరెడ్డి, 27 ఏళ్ళుగా ప్రవాసి హక్కుల కౌన్సిల్‌ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. పాలమూరు ప్రవాసి కార్మిక యూనియన్‌ ద్వారా విదేశాల్లో మరీ ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కార్మికులకు అండగా నిలుస్తున్నారు. మే 26న జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ (స్కూల్‌ ఆఫ్‌ ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌ ఖతార్‌)లో జరిగిన ప్రవాసీ కార్మికుల రక్షణ, ఎంబసీల పాత్ర అనే అంశంపై జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు భీంరెడ్డి. మైగ్రేంట్‌ ఫోరమ్‌ ఇన్‌ ఆసియా, ది ఖతార్‌ ఫౌండేషన్‌ అండ్‌ జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రవాసి కార్మికుల సమస్యలను ఆయన ప్రస్తావించారు. మానవీయ కోణంలో పేద కార్మికులకు ప్రభుత్వాలు, ఎంబసీ అధికారులు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇండియన్‌ ఎంబసీ ద్వారా గల్ఫ్‌లో మరణించినవారిని వారి స్వస్థలాలకు చేర్చడం, దీనికోసం హైద్రాబాద్‌ విమానాశ్రయం వద్ద ఓ అంబులెన్స్‌ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి స్వస్థలాలకు మృత దేహాల్ని ఉచితంగా తరలించే సౌకర్యం కల్పించడం, విదేశాలకు పని నిమిత్తం వెళ్ళే పేదవారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం, వివిధ కారణాలతో విదేశీ జైళ్ళల్లో మగ్గేవారికి న్యాయ సహాయం అందించడం వంటి కార్యక్రమాల ద్వారా భీంరెడ్డి ‘ప్రవాసి మిత్ర’గా గుర్తింపు సంపాదించుకున్నారు.మాగల్ఫ్.కామ్ ప్రతినిధి వనంబత్తిన రాజ్ కుమార్ గారు స్వయముగా వెళ్లి విషయాలు తెలుసుకున్నారు.

 

--వి.రాజ్ కుమార్(ఖతార్)


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com