10 మిలియన్ దిర్హామ్‌ల విలువైన నకిలీ మొబైల్ ఫోన్ల పట్టివేత
- April 08, 2016
దుబాయ్ ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (డిఇడి) ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ సెక్షన్ సోమవారం 47000 నకిలీ మొబైల్ ఫోన్లు, 99,000 మొబైల్ ఫోన్ ఛార్జర్లను స్వాధీనం చేసుకున్నారు. 110,000 బ్యాటరీలు కూడా పోలీసులకు దొరికాయి. వీటి మొత్తం విలువ 10 మిలియన్ దిర్హామ్‌లు ఉంటుందని అంచనా వేశారు. ఓ హోటల్ అపార్ట్మెంట్లో వీటిని తయారు చేశారనీ, అది రీ ప్యాకేజింగ్ సెంటర్‌గా అనుమానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ హోటల్ నుంచి నకిలీ వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం ఇదే రతొలిసారి అని అధికారులు చెప్పారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్రహీమ్ బెహ్జాద్ మాట్లాడుతూ, నిబంధనల్ని ఉల్లంఘించి ఆ హోటల్ కమర్షియల్ ఫ్రాడ్‌కి తెరలేపిందని అన్నారు. నకిలీ వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







