స్మగ్లింగ్‌ డ్రగ్స్‌: ఇద్దరికి జీవిత ఖైదు

- April 08, 2016 , by Maagulf
స్మగ్లింగ్‌ డ్రగ్స్‌: ఇద్దరికి జీవిత ఖైదు


ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులకు హై క్రిమినల్‌ కోర్ట్‌ జీవిత ఖైదు విధించింది. డ్రగ్స్ర్‌ స్మగ్లింగ్‌ చూస్తూ బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో మొదటి వ్యక్తి పోలీసులకు చిక్కాడు. 944.3 గ్రాముల హెరాయిన్‌ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌కి చెందిన ఓ వ్యక్తి నుంచి ఈ హెరాయిన్‌ని నిందితుడు తెచ్చినట్లు గుర్తించారు. 3,600 బహ్రెయినీ దినార్స్‌కి హెరాయిన్‌ని మార్చాలనుకున్నాడు ఆ వ్యక్తి. రెండో వ్యక్తికి సంబంధించి పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. రెడ్‌ హ్యాండెడ్‌గా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తానీ సంప్రదాయ దుస్తుల్లో ఓ పోలీస్‌ అధికారి సదరు నిందితుడి వద్దకు వెళ్ళి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ జీవిత ఖైదు (అంటే 25 ఏళ్ళు) విధింపబడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com