ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోడీ
- June 06, 2022
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ చేపట్టిన ఐకానిక్ వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. 12 ప్రభుత్వ పథకాల్లో భాగంగా యువత, వ్యాపారులు, రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ‘జన సమర్థ్ పోర్టల్’ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. కేంద్రం సమకూర్చిన పక్కా ఇళ్లు, విద్యుత్, గ్యాస్, తాగునీరు, ఉచిత వైద్యం.. పేదల గౌరవాన్ని పెంచాయని తెలిపారు. అంతర్జాతీయ వ్యాపారం, సరఫరా గొలుసులో భారత దేశ బ్యాంకులతోపాటు కరెన్సీకి కీలక భాగస్వామ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని మోడీ పిలుపునిచ్చారు.
“స్వాతంత్ర్య దినోత్సవ 75ఏళ్ల ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశ అభివృద్ధి కోసం తమ తమ స్థాయిల్లో కృషి చేయడం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం. ఆర్థిక సమ్మిళిత కోసం మేము ఒక వేదికను తయారు చేశాం. దాని ఉపయోగాల గురించి అవగాహన పెంచాలి. మన బ్యాంకులు, కరెన్సీ.. అంతర్జాతీయ సరఫరా గొలుసు, వ్యాపారంలో కీలక భాగస్వామి కావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.” అంధులు సులభంగా గుర్తించే వీలున్న కొత్త సిరీస్ నాణేలను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 విలువగల నాణేలు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్‌ను కలిగి ఉంటాయని తెలిపారు. అయితే ఇవి కేవలం స్మారక నాణేలు కావని.. చలామణీలో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ కొత్త సిరీస్ నాణేలు.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లక్ష్యాన్ని ప్రజలకు గుర్తు చేస్తాయని, దేశ అభివృద్ధికి కృషి చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







