స్పైస్ జెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు పెంపు
- April 08, 2016
ప్రముఖ చవక ధరల విమాన యాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్ని పెంచింది. దేశీయ టికెట్‌ని రద్దు చేసుకుంటే రూ.2,250, అంతర్జాతీయ టికెట్ రద్దు చేసుకుంటే రూ.2,500 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయని చెప్పింది. ఏప్రిల్ 7 నుంచీ ఈ పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయని తెలిపింది.గతంలో ఈ ఛార్జీలు దేశీయ విమాన టికెట్ రద్దు చేసుకుంటే రూ.1,899గా, అంతర్జాతీయ టికెట్ రద్దు చేసుకుంటే రూ.2,349గా ఉండేవి. ఇప్పుడు ఛార్జీల పెంపుతో పై విధంగా మారాయి. ఇండిగోతోపాటు పలు విమాన యాన సంస్థలు గత ఫిబ్రవరిలోనే క్యాన్సిలేషన్ ఛార్జీల్ని పెంచాయి. ఇప్పుడు స్పైస్ జెట్ కూడా వాటి సరసన చేరింది.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









