వివాదస్పద వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ

- June 07, 2022 , by Maagulf
వివాదస్పద వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ

అబుదాబి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చేసిన వివాదస్పద వ్యాఖ్యలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. మానవీయ విలువలు, సూత్రాలకు విరుద్ధమైన ప్రవర్తనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ (MoFAIC) ప్రకటించింది. మతపరమైన చిహ్నాలను గౌరవించాలని, హింసను ప్రేరేపించేలా ద్వేషపూరిత ప్రసంగం చేయొద్దని కోరింది. సహనం, మానవ సహజీవనం విలువలను వ్యాప్తి చేయడానికి అంతర్జాతీయ బాధ్యతను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com