‘అలీబాబా’కు ప్రాంతీయ కేంద్రంగా సౌదీ అరేబియా
- June 07, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో తన సేవలను ప్రారంభించినట్లు సౌదీ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ (SCCC) ప్రకటించింది. అలీబాబా క్లౌడ్ కార్యకలాపాలకు ప్రాంతీయ కేంద్రంగా రియాద్‌ను ఎంచుకున్నట్లు తెలిపింది. రియాద్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల అధికారుల సమక్షంలో ఈ మేరకు వెల్లడించారు. సౌదీ అరేబియాలోని రెండు డేటా సెంటర్లతో కింగ్‌డమ్‌లోని కస్టమర్లకు అధిక భద్రత, స్థిరత్వంతో క్లౌడ్ సామర్థ్యాలను అందివ్వనున్నట్లు పేర్కొంది. కొత్త డేటా సెంటర్లు రిటైల్, ఫిన్‌టెక్, ఇంటర్నెట్ వంటి పరిశ్రమల నుండి పెరుగుతున్న వ్యాపార డిమాండ్‌ను తీర్చడానికి కంప్యూట్, స్టోరేజ్, నెట్వర్క్ నుండి డేటాబేస్ వరకు విస్తృతమైన, సురక్షితమైన పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ పరిష్కారాలను అందిస్తాయని ఎస్సీసీసీ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







