మాదకద్రవ్యాల వ్యాపారం.. జైలు శిక్ష, AED100,000 జరిమానా
- June 07, 2022
అబుదాబి: మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తే విధించే శిక్షల గురించి యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాలను ఎదుర్కోవడంపై 2021లోని ఫెడరల్ డిక్రీ-లా నెం. 30లోని ఆర్టికల్ నెం. 65 ప్రకారం.. డ్రగ్స్ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బును కలిగి ఉన్న, దాచిపెట్టే లేదా డీల్ చేసిన వ్యక్తికి జైలుశిక్ష, జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. మాదకద్రవ్యాల వ్యాపారంలో డబ్బుకు ఉన్న లింక్‌లను రుజువు చేయడానికి తగిన సాక్ష్యం ఉంటే.. AED100,000 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. దేశంలోని తాజా చట్టాల గురించి వారి అవగాహనను పెంచడానికి సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రయత్నిస్తుంటుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







