భారత ఉపరాష్ట్రపతిని కలిసిన షురా కౌన్సిల్ స్పీకర్
- June 07, 2022
దోహా: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడుతో షూరా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్ సమావేశమయ్యారు. దోహాలోని భారత ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఖతార్ లో అధికార పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖతార్, భారతీయ ప్రజల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను వారు గుర్తు చేసుకున్నారు. అలాగే భారతదేశంలోని అధికార పార్టీలోని ఒక నేత ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఖతార్ ప్రజల అసంతృప్తిని భారత ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటివి ప్రజల మధ్య సయోధ్యకు సహాయపడవని ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







