దుబాయ్ లో భారతీయుడి నిజాయితీ, పోలీసుల ప్రశంసలు
- June 07, 2022
దుబాయ్: భారత ప్రవాసుడు చేసిన పనికి దుబాయ్ పోలీసులు ప్రశంసించారు.1మిలియన్ దిర్హాములు నగదుతో ఉన్న బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు మనోడు. దాంతో భారత వ్యక్తి నిజాయితీని మెచ్చుకుని దుబాయ్ పోలీస్ అధికారులు ప్రత్యేక ప్రశంస పత్రం అందజేశారు.అల్ బార్షా ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో తారిఖ్ మహమూద్ ఖలీద్ మహమూద్ అనే భారత ప్రవాసుడు నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం బిల్డింగ్‌కి సంబంధించిన ఎలివేటర్‌లో తారిఖ్‌కు ఓ బ్యాగ్ కనిపించింది. తెరిచిచూస్తే దాని నిండా నగదు ఉంది. దాంతో వెంటనే అల్ బార్షా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. అయితే, భారత వ్యక్తి బ్యాగ్ తీసుకెళ్లి ఇవ్వడానికి కొన్ని గంటల ముందు అదే పోలీస్ స్టేషన్లో ఓ అరబ్ వ్యక్తి 1మిలియన్ దిర్హాములు నగదుతో ఉన్న తన బ్యాగ్ ఒకటి పోయినట్లు ఫిర్యాదు చేశాడు. అది కూడా అప్పుగా తీసుకున్న సొమ్ముగా అతడు పేర్కొన్నాడు.
ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే తారిఖ్ ఓ బ్యాగ్ తీసుకెళ్లి ఇచ్చాడు.తాను నివాసముండే బిల్డింగ్ ఎలివేటర్‌లో అది దొరికినట్లు తెలిపాడు. దాంతో వెంటనే పోలీసులు అంతకుముందు తమకు బ్యాగ్ మిస్సింగ్ విషయమై ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఫోన్ చేశారు. ఆ వ్యక్తి వెంటనే అల్ బార్షా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆ బ్యాగ్ తనదేనని కన్‌ఫార్మ్ చేశాడు. అంతేగాక అందులో రూ.2.11కోట్లు ఉన్నట్లు తెలిపాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ బ్యాగ్‌లో ఉన్న నగదును లెక్కించారు. అతను చెప్పినట్టుగానే అవి సరిగ్గా 1మిలియన్ దిర్హాములుగా లెక్క తేలింది. పోలీసులు ఆ బ్యాగ్‌ను అరబ్ వ్యక్తి అప్పగించారు. అనంతరం నిజాయితీ చాటిన భారత ప్రవాసుడికి ప్రత్యేక ప్రశంస పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ రహీమ్ బిన్ షఫీ మాట్లాడుతూ తారిఖ్ మహమూద్‌పై ప్రశంసలు కురిపించారు. భారత ప్రవాసుడు చేసిన పనికి మెచ్చుకున్నారు. దుబాయ్‌లో ఉన్న ప్రవాసులందరూ గర్వంగా చెప్పుకునే పని చేశాడంటూ ప్రశంసించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







