అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో నెగ్గిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

- June 07, 2022 , by Maagulf
అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో నెగ్గిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

లండన్: ప్రధాని బోరిస్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో విజయం సాధించారు.సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎదురైన అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన బోరిస్ జాన్సన్ తనకు తిరుగులేదనిపించుకున్నారు.అవిశ్వాస తీర్మానంలో జాన్సన్‌ చట్టసభ సభ్యులలో 59% మంది మద్దతుతో ఆయనకు అనుకూలంగా 211 ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన విజయం సాధించారు.

'పార్టీ గేట్' కుంభకోణం క్రమంలో సొంత పార్టీ సభ్యులే జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందులో జాన్సన్‌కు అనుకూలంగా 211 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 148 ఓట్లు వచ్చాయి. ఫలితంగా 59 శాతం మంది చట్ట సభ్యుల విశ్వాసాన్ని బోరిస్ పొందారు.2019 ఎన్నికల్లో విజయం సాధించిన బోరిస్.. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో తన డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం, తన నివాసంలో స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఇటీవల బోరిస్ జాన్సన్ పార్లమెంటులో క్షమాపణలు కూడా చెప్పారు.

కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో మద్యం పార్టీ చేసుకోవడం వివాదాస్పదం కావడంతో సొంతపార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు జాన్సన్‌ను తీరును తప్పుబట్టారు. ఆయన చేసిన ఈ పని ఓటర్లలో విశ్వాసాన్ని దెబ్బతీసిందని…ఆయన పదవి నుంచి వైదొలగాలంటూ కొన్ని వారాల క్రితం 40 మందికిపైగా ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం (జూన్ 6,2022)ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అందులో బోరిస్ విజయం సాధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com