గ్యాంగ్ రేప్ ఘటన..తెలంగాణ సీఎస్, డీజీపీలకు నోటీసులు
- June 07, 2022
హైదరాబాద్: హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్‌పై జాతీయ మహిళా కమిషన్ కూడా దృష్టి సారించింది. పబ్ వద్దకు వచ్చిన ఓ మైనర్ బాలికను కారులో ఎక్కించుకున్న ఐదుగురు యువకులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు ఆందోళన వ్యక్తం చేయడంతో ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అసలు దోషులను పోలీసులు కాపాడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపైనా విచారణ మొదలుపెట్టినట్టు మహిళా కమిషన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







