పండ్లు తిని 'యోగా' చెయ్యటం మంచిది
- June 12, 2015
మనస్సుకు మరియు శరీరానికి ఎనర్జీ అందివ్వడంలో యోగా ఒక పవర్ ఫుల్ ఆయుధం వంటింది. యోగ మన శరీరాన్ని, మనసును మరియు ఆత్మను ఒకే పంధాలో తీసుకువచ్చే ఒకే సంపూర్ణమైన పద్ధతి. ఈ ప్రాచీనమైన విజ్ఞానం ఆధునిక యుగానికి అనువర్తించే విధంగా తీర్చి దిద్దిన ఒక మంచి మార్గము. రోజూ సాధన చేస్తే మన అంతర్గత శక్తిని పెంచి సంపూర్ణ సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఇన్ని విధాలుగా ఉపయోగపడే యోగ చేయడానికి ముందు కొన్ని ఆహారాలు తీసుకోడం వల్ల మరింత ఉపయోగకరం. మీరు ఇప్పుడిప్పుడే యోగా నేర్చుకోవడం మొదలు పెట్టి ఉంటే మీకు వీటి మీద అంతగా అవగాహన ఉండకపోవచ్చు. యోగా శరీరంను మరియు మానసిక స్థితిని మెరుగుపరచడం మాత్రమే కాకుండా..ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మనిషి దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే అంతర్గత జీర్ణక్రియ మరియు జీవక్రియలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకు శక్తి వంతమైన అవసరం అయిన ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా యోగా క్లాసులకు వెళ్ళావారికి ఇవి చాలా అవసరం అవుతాయి. కాబట్టి, యోగా క్లాసులకు వెళ్ళడానికి ముందు మీరు తీసుకోవల్సిన ఆహారాల గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. జుట్టు రాలే సమస్యలకు త్వరిత పరిష్కార మార్గం:ఎఫెక్టివ్ యోగాసనాలు యోగా క్లాసులకు వెళ్ళడానికి మిమ్మల్ని బద్దకస్తులుగా మార్చే లేదా పొట్టను బరువుగా మార్చే ఆహారాలను తినకూడదు . ఖాలీ పొట్టతో యోగ చెయ్యకూడదు. అలా చేయడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అంతరాయం మరియు మెటబాలిజంకు అంతరాయం కలిగించి కండరాలను బలహీనపరుస్తాయి. ఫ్లాట్ టమ్మీ పొందడానికి 10 యోగ భంగిమలు: ముఖ్యంగా ఖాలీ పొట్టతో యోగా చేస్తే కళ్ళు తిరగడం, లేదా పూర్తిగా యోగ క్లాసులో గడపలేకపోవడం జరుగుతుంది. కాబట్టి, ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఎనర్జిటిక్ ఫుడ్స్ ను తినడం వల్ల మీరు తగినంత శక్తిని పొందవచ్చు. బాదం ఎనర్జీ బూస్టర్ మరియు ఇది యోగా క్లాసులకు ముందు తినడానికి ఒక ఉత్తమ ఆహారం. ఎందుకంటే ఇందులో బాదం, మెగ్నీషియం, పొటాషియం, మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండి శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది . మరియు కండరాలకు అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది. కాబట్టి, యోగ క్లాసులకు వెళ్ళే ముందు 5-6బాదంలను నోట్లో వేసుకొని నమిలి మింగాలి. డార్క్ చాక్లెట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది మరియు మెదడుకు అవసరం అయ్యే రక్తంను ప్రసరింపచేస్తుంది . కాబట్టి, యోగా క్లాస్ కు వెళ్ళే ముందు రెండు మూడు పీస్ ల డార్క్ చాక్లెట్ తింటే మీకు ఏవిధంగా ఆశ్చర్యం కలిగిస్తుందో మీరు గమనించవచ్చు. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల దీన్ని ప్రీ యోగా స్నాక్ గా తీసుకోవచ్చు. అరటిపండ్లలో పొటాసియం మరియు సోడియం కలిగి ఉండటం వల్ల ఇది శరీరంను హైడ్రేషన్లో ఉంచుతుంది . అరటిపండ్లలో ఉండే మెగ్నీసియం కడుపు ఉబ్బరాన్ని మరియు క్రాంప్ ను నివారిస్తుంది . కాబట్టి, యోగా క్లాస్ కు ముందు ఈ బెస్ట్ ఫుడ్ తీసుకోవడం కూడా ఉత్తమమే. అరటి, అవొకాడో, కోకో, బాదం మరియు కొన్ని కొబ్బరి పాలు లేదా కొబ్బరి నీళ్ళతో కలిపి స్మూతీస్ తయారుచేసి తీసుకోవడం వల్ల తక్షణం మీలో శక్తివంతమైన పవర్ వస్తుంది . కాబట్టి, యోగా ప్రారంభించడానికి ముందు స్మూతీస్ ను ఎక్సలెంట్ ఫుడ్స్ గా తీసుకోవచ్చు. ఇది ఒక ప్రీ యోగా స్నాక్ . యోగా క్లాసులకు వెళ్ళడానికి ఒక గంట ముందు ఓట్ మీల్ తీసుకోవడం వల్ల ఇది చాలా తేలిక జీర్ణం అవుతుంది. అంతే కాదు ఓట్ మీల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మజిల్ క్రాంప్ ను నివారించి మీ ఎనర్జీ లెవల్స్ ను నివారిస్తుంది. ఓట్ మీల్స్ తో మీకు నచ్చిన ఫ్రూట్స్ మరియు నట్స్ చేర్చి తీసుకోవచ్చు. అవొకాడో ఒక అద్భుతమైన ఎనర్జీని అందించే ఫుడ్ గా యోగా ముందు తీసుకుంటారు. అవొకాడోలో పొటాసియం మరియు మెగ్నీషియం 60శాతం ఉంటుంది . అరటిపండ్లతో పోల్చితే ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కణాలజాల క్రియలకు బాగా సహాయపడుతుంది.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







