తాత్కాలికంగా మూసివేయబడిన 'క్వాలిటీ హైపర్ మార్కెట్'
- June 13, 2015
సల్వా రోడ్డులోనున్న ప్రముఖ హైపర్ మార్కెట్లోని గ్రోసరీ సెక్షన్ని, ఐదురోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఖతార్ పురపాలక మరియు పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ (MMUP) వారు ప్రకటించారు.MMUP వారు తమ ఫేస్‌బుక్ పేజీలో, "అపరిశుభ్రమైన పరిసరాలలో తినుబండారాలను తయారుచేస్తూ, విక్రయిస్తున్నందున" క్వాలిటీ హైపర్ మార్కెట్ యొక్క ఫుడ్ సెక్షన్ను మూసివేసినట్టు తెలిపారు.
వారు పోస్ట్ చేసిన ఫొటోల ప్రకారం, MMUP వారి యొక్క ఇన్‌స్పెక్టర్లు, స్టోరులోని బేకరీ, డైరీ, మీట్ ఇంకా ఫిష్ సెక్షన్లు వంటి అనేక ఏరియాలలో తనిఖీలు నిర్వహించారు.
హైపర్ మార్కెట్ యొక్క పై అంతస్తులో నున్న ఎలక్టానిక్స్ మరియు ఇతర గృహోపయోగ పరికరాలను కలిగియున్న విభాగం యధావిధిగా ప్రజల వినియోగార్ధమై ఉన్నది.
ప్రజల ప్రతిస్పందన
రానున్న వారం రోజుల్లో రమదాన్ నెల ప్రారంభం సందర్భంగా క్రయ-విక్రయాలు ఊపందుకుంటున్న ఈ పరిస్థితుల్లో, ఈ మూసివేత ఖతార్ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందనే చెప్పాలి!
--వి.రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







