భారత్ కరోనా అప్డేట్
- June 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
ప్రస్తుతం దేశంలో 1.62 శాతం రోజువారీ పాజిటివిటీ రేటుతో, 32,498 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎప్పట్లాగే మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మహారాష్ట్రలో 2,701 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే 1,765 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో బీఏ5 వేరియెంట్ కూడా ఉంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసుల పెరుగుదల 40 శాతం ఉండగా, మంగళవారంతో పోలిస్తే బుధవారం కూడా మరో 40 శాత కరోనా కేసులు పెరిగాయి. బుధవారం కరోనా నుంచి 3,591 మంది కోలుకున్నారు. తమిళనాడులో 195, ఢిల్లీలో 564, ఒడిశాలో 15, మిజోరంలో 15 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. పలు రాష్ట్రాలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేశాయి. గడిచిన 24 గంటల్లో 15.4 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. వీరిలో నాలుగు లక్షల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. 3 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తైంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!







