కన్నుల పండుగగా నయనతార వివాహం
- June 09, 2022
చెన్నై: నయనతార -విఘ్నేష్ ల వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఈరోజు ఉదయం మహాబలిపురంలో ఉన్న షెరటాన్ గ్రాండ్ హోటల్ లో సన్నిహితులు , కుటుంబ సభ్యులు , సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం చాలా అంగరంగవైభవంగాజరిగింది. సుమారుగా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకుంటున్న వీరు ఎవరికీ తెలియకుండా 2021లో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నేడు హిందూ సాంప్రదాయ పద్ధతి లో విగ్నేష్ శివన్ చేత మూడుముళ్ల వేయించుకొని సరికొత్త అధ్యయనాన్ని ప్రారభించింది.
తన చిరకాల ప్రేయసిని పెళ్లాడిన విఘ్నేశ్ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ తన అర్ధాంగికి నుదుటన ముద్దు పెట్టిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘నయన్, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది’ అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు చిలకా గోరింకల్లా ఉన్నారు, నిండునూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, హీరో కార్తి, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దర్శకుడు అట్లీ, నిర్మాత బోనీకపూర్, మణిరత్నం, అజిత్, విజయ్‌తో పాటు టాలీవుడ్, శాండల్‌వుడ్‌కు చెందిన సినీ సెలబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. మరోవైపు తమ జీవితాల్లో ప్రత్యేకమైన ఈ రోజుని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందితోపాటు 1800 మంది చిన్నారులకు భోజనం అందజేయాలని ఈ జంట నిర్ణయించుకుందట. ఈ మేరకు అభిమాన బృందాలతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







