భారత ప్రవాసులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
- June 09, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది. పాస్‌పోర్ట్, వీసా సేవలను అందించే జలీబ్(అబ్బాసియా), ఫహాహీల్‌లోని బీఎల్ఎస్ ఔట్‌సోర్సింగ్ కేంద్రాలను తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఈ రెండు సెంటర్లు మూసే ఉంటాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.అయితే,కువైట్ సిటీలోని అలీ అల్ సేలం స్ట్రీట్‌లోని జవహార్ టవర్స్‌లో ఉన్న మూడో కేంద్రం మాత్రం ఇకపై 24/7 తెరిచే ఉంటుందని రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రవాసులు వీసా, పాస్‌పోర్టు తాలూకు దరఖాస్తులను ఈ కేంద్రంలో సమర్పించాలని కోరారు.ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్రకటన చేసింది. ప్రవాసులు దీన్ని దృష్టిపెట్టుకుని అసౌకర్యానికి గురి కాకుండా ముందే ప్రణాళిక ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.కువైట్ సిటీ బీఎల్ఎస్ సెంటర్‌లో దరఖాస్తు సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్న ప్రవాసులు 65506360 నం.కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల