రామ్ చరణ్-ఉపాసనల టెన్త్ యానివర్సరీ స్పెషల్ ఏంటో తెలుసా.?

- June 10, 2022 , by Maagulf
రామ్ చరణ్-ఉపాసనల టెన్త్ యానివర్సరీ స్పెషల్ ఏంటో తెలుసా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి లెగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. అయితే, మెగా వారసత్వం అనేది ఒకటి వుంటుంది కదా. మెగా ఫ్యాన్స్ అందరిలోనూ ఇదే పెద్ద లోటుగా పరిణమించింది. అపోలో ఆసుపత్రికి వారసురాలైన ఉపాసనను 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్నాడు రామ్ చరణ్.

పదేళ్లు కావస్తున్నా, ఈ మెగా దంపతులకు పిల్లలు కలగలేదు. ప్రొఫిషనల్‌గా వేర్వేరు రంగాల్లో బిజీగా వుండే వీరిద్దరూ పర్సనల్ లైఫ్‌ని బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. కలిసి వెకేషన్స్‌కి వెళుతుంటారు. కొన్నిసార్లు రామ్ చరణ్ లాంగ్ షూటింగ్ షెడ్యూల్స్‌కి ఉపాసన కూడా వెంట వెళుతూ వుంటుంది. దగ్గరుండి చరణ్ షూటింగ్‌ని ఎంజాయ్ చేస్తుంటుంది కూడా.

కానీ, వేర్వేరు కారణాలతో వీరిద్దరూ పిల్లల మీద ఫోకస్ పెట్టలేదు. మీడియా నుంచీ, సోషల్ మీడియా నుంచీ ఈ సందర్భంగా వచ్చే ప్రశ్నలను ఎప్పటికప్పుడే చాకచక్యంగా తిప్పి కొడుతుంటారీ మెగా దంపతులు. సరే, ఇఫ్పుడెందుకీ టాపిక్ అంటే, జూన్ 14న చరణ్, ఉపాసనల టెన్త్ యానివర్సరీకి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మెగా టెన్త్ యానివర్సరీకి ఇటలీ నగరం వేదిక కానుంది. ఇటలీలోని అందమైన నగరాల్లో ఒకటి మిలాన్ నగరం. మిలాన్‌లో రామ్ చరణ్, ఉపాసనల టెన్త్ యానివర్సరీకి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయ్. అయితే, ఎవరెవరు ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అవుతారన్న విషయం ఇంకా తెలియాల్సి వుంది.

కాగా, రామ్ చరణ్ ఈ మధ్య ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని,  ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. కైరా అద్వానీ ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com