నిబంధనలు అతిక్రమిస్తే జైలే

- June 13, 2015 , by Maagulf
నిబంధనలు అతిక్రమిస్తే జైలే

నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రికల్ పరికరాల్ని ఉపయోగించినా, అక్రమ కనెక్షతో విద్యుత్, నీరు పొందినా ఇకపై కఠినంగా శిక్షించేందుకు తగిన చట్టాల్ని రూపొందిస్తోంది బహ్రెయిన్ ప్రభుత్వం. ఎనర్జీ మరియు వాటర్ అథారిటీ అను నిత్యం తనిఖీలు నిర్వహిస్తుంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్వే ఎంటనే పవర్నీ, నీటి కనెక్షన్నీ కట్ చేయనుంది. మొదటిసారి తప్పుకి మూడు నెలల నుంచి ఐదు నెలల జైలు శిక్ష, 1000 నుంచి 2000 బహ్రెయినీ దినార్స్ వరకూ జరీమానా.. రెండూ కలిపిగానీ, లేదంటే విడిగా గానీ అమలు చేస్తారు. ఓసారి శిక్ష పడిన తర్వాత కూడా నేరానికి పాల్పడితే శిక్ష, జరీమానా మరింతగా పెరగనున్నాయి.  ఇది కాకుండా బహ్రెయిన్ పార్లమెంట్, పెరుగుతున్న విడాకుల రేటుపైనా చర్చించనుంది. తీవ్రవాదం వంటి అంశాలపైనా పార్లమెంటులో చర్చ జరుగుతుంది.

 

--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com