‘పక్కా కమర్షియల్’ షూటింగ్ పూర్తి..
- June 10, 2022
హైదరాబాద్: ప్రతి రోజు పండగే లాంటి మెగా హిట్ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ లో మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా నటిస్తుండగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కాగా తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. చాలారోజులగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ముగించుకోవడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకున్నారు. సెట్స్‌లో చివరిరోజు కావడంతో, చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, జూన్ 12న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. మరి పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు