పోలీసుల చేతిలో ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ నోట్
- June 11, 2022
హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల హైదరాబాద్‌లో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.అయితే ఆమెకు ఆత్మహత్యకు చెందిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది.
అందులో ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను వివరంగా వెల్లడించారు. తాను స్వేచ్ఛను కోరుకున్నానని అందులో ఆమె పేర్కొంది. అంతేకాకుండా తాను ఎవరికీ భారం కాదల్చుకోలేదని కూడా ఆమె తెలిపారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అనేక సార్లు యత్నించినట్లు చెప్పిన ప్రత్యూష. ప్రతి రోజు తాను బాధపడుతూనే ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే…శనివారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి అయ్యింది. మరోవైపు మహిళా సెలబ్రిటీలకు డిజైనింగ్‌లో ప్రత్యూష సిద్ధహస్తురాలని తెలుస్తోంది. దేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష కూడా ఒకరు. టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో పాటు పలువురు క్రీడాకారులకు కూడా ఆమె డిజైనింగ్ చేశారు.ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఆత్మహత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్‌ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు కనుగొన్నారు. తన ఇంట్లోని బాత్ రూమ్‌లో ప్రత్యూష విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







