‘జాతి రత్నాలు’ ఫేమ్: రూటు మార్చిన చిట్టి.. ‘పక్కా కమర్షియల్’.!
- June 11, 2022
‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లాకి పరిచయం చేయాల్సిన పని లేదు. ‘జాతి రత్నాలు’ సినిమా టైమ్‌తో యూత్‌లో భలే క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. మాంచి పొడగరి అయిన ఫరియా అబ్ధుల్లా, తెలుగులో ఆజానుబాహులైన హీరోల పక్కన సత్తా చాటుతుందని అనుకున్నారంతా.
కానీ కుదరలేదు. చిన్నా చితకా అవకాశాలకు మాత్రమే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ. ‘జాతి రత్నాలు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ భామ, సెకండ్ సినిమాకే సెకండ్ హీరోయిన్ అయిపోయింది. అదేనండీ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది.
‘బంగార్రాజు’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇదంతా ఫరియా అబ్ధుల్లా సినిమాల లిస్టు. అయితే, ఫరియాలో ఇంకో కోణం వుంది. కేవలం ఫరియా నటి మాత్రమే కాదు, మంచి డాన్సర్. అందునా ఫ్రీ స్టైల్ డాన్సర్. దీనికి సంబంధించి కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తుంటుంది ఫరియా అబ్ధుల్లా.
తాజాగా అలాంటి ఓ ఈవెంట్ ఫరియాకి బాగా వర్కువుట్ అయ్యిందట. కమర్షియల్‌గా నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి తన స్పెషల్ టాలెంట్ బాగా యూజ్ అవుతోందని చెబుతోంది ఫరియా అబ్ధుల్లా. ఈ మధ్య హైద్రాబాద్‌లో తన స్నేహితులతో కలిసి ఫరియా చేసిన డాన్స్ పర్ఫామెన్స్ సూపర్ హిట్ అయ్యిందట. దాంతో ఫరియా ఆనందానికి అవధుల్లేవ్. రెగ్యులర్‌గా ఇలాంటి డాన్స్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తానంటోంది చిట్టి పాప.
సినిమాలున్నా లేకున్నా, తన టాలెంట్ తనకు యూజ్ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే, అలాగని సినిమాలకు తాను దూరం కాదనీ చెబుతోంది అందాల భామ ఫరియా అబ్ధుల్లా. ప్రస్తుతం ఫరియా ‘రావణాసుర’ సినిమాలో నటిస్తోంది. మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకుడు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







