రూటు మార్చిన అక్కినేని బుల్లోడు: ఈ సారైనా సక్సెస్ అవుతాడా.?

- June 11, 2022 , by Maagulf
రూటు మార్చిన అక్కినేని బుల్లోడు: ఈ సారైనా సక్సెస్ అవుతాడా.?

అక్కినేని బుల్లోడు నాగ చైతన్య మొదట్నుంచీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూనే వున్నాడు. కానీ, వర్కవుట్ కావడం లేదు. కెరీర్ తొలి నాళ్లలోనే మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడానికి తెగ వెంపర్లాడాడు. కానీ, ప్రయత్నించిన ప్రతిసారీ ఫెయిలవుతూనే వచ్చాడు.
ఈ మధ్య ‘వెంకీ మామ’, ‘బంగార్రాజు’, ‘లవ్ స్టోరీ’ చిత్రాలతో వరుస హిట్లు కొట్టి చైతూ ఫుల్ స్వింగ్‌లో వున్నాడు. కెరీర్ పీక్స్‌లో వున్న టైమ్‌లోనే ప్రయోగాలు చేస్తే బాగుంటుందని చైతూ భావిస్తున్నాడట. ఆ కోణంలోనే వెంకట్ ప్రభుతో చైతూ చేయబోయే సినిమా మాస్ కంటెంట్‌‌లో వుండబోతోందనీ తెలుస్తోంది.

అలాగే, ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌ని చైతూ లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పక్కా మాస్ బ్యాక్ డ్రాప్‌లోనే వుండబోతోందనీ ఇన్ సైడ్ లీక్.

గతంలో చైతూ, ‘బెజవాడ’ తదితర సినిమాలతో మాస్ ట్రెండ్ ట్రై చేశాడు. బొక్క బోర్లా పడ్డాడు. ఈ సారి అలా కాకుండా జాగ్రత్త పడేందుకు కొన్ని సర్‌ప్రైజింగ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడట. మేకోవర్‌లో మార్పులతో పాటు, బాడీ లాంగ్వేజ్‌లోనూ కొత్తదనం చూపించేందుకు చైతూ తాపత్రయ పడుతున్నాడట. ఈ సారైనా చైతూ కష్టం ఫలిస్తుందో లేదో చూడాలిక.
మరోవైపు చైతూ నటించిన ‘థాంక్యూ’ మూవీ త్వరలో రిలీజ్‌కి రెడీగా వుంది. రాశీ ఖన్నా ఈ సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది. అన్నట్లు రాశీఖన్నా, చై జోడీ ‘వెంకీ మామ’ సినిమాలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com