తెలుగు రాష్ట్రాల్లో 'విద్యాదాన్' స్కాలర్షిప్లు..
- June 12, 2022
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు పూర్తి అయిన విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే టెన్త్ ఫలితాలు విడుదలవగా..తెలంగాణలో త్వరలో విడుదల కానున్నాయి. ఐతే 2021-22 విద్యాసంవత్సారానికి సంబంధించి పదో తరగతిలో 90శాతం మార్కులు లేదా 9 CGPAతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు 'విద్యాదాన్' ఉపకార వేతనాలు అందిచనున్నట్లు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ జూన్ 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. దివ్యాంగ విద్యార్థులకైతే 75 శాతం లేదా 705 CGPA మార్కులుంటే సరిపోతుంది.
2022 విద్యాసంవత్సరానికి ఇంటర్ (11వ తరగతి) చదివే విద్యార్ధులకు రూ. 10,000ల చొప్పున, 2023లో ఇంటర్ 12వ తరగతి వరకు విద్యార్థులకు స్కాలర్షిప్గా అందిస్తారు. ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాక కాల పరిమితి, విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా ఏటా రూ.60 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వనుంది. ఐతే తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపు ఉండాలి.ఈ అర్హతలున్న విద్యార్థులు https://www.vidyadhan.org/web/index.php లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జులై 10 వరకు కొనసాగుతుంది. దరఖాస్తుల అనంరం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తేదీ జులై 24, 2022. ఇంటర్వ్యూ తేదీలు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొనసాగుతాయి. రాత పరీక్షకు జులై 15 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తారు. సందేహాల నివృతికి ఫోన్ నంబర్ 8367751309 లేదా [email protected] ద్వారా సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







