తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
- June 12, 2022
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్కు ముందుకు వస్తున్నాయి. తాజాగా 24వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ కంపెనీ ముందుకు వచ్చింది. అడ్వాన్స్డ్ అమోలెడ్ డిస్ప్లేలు తయారీలో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీతో ఎంఓయూ చేసుకున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చరిత్రలో నిలిచిపోయే రోజంటూ ట్విట్ చేశారు.
తెలంగాణలో ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీల దృష్టిని హైదరాబాద్ ఆకర్షిస్తోంది. ఇప్పటికే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి కేటీఆర్ పలు కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
దావోస్లో మంత్రి కేటీఆర్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారం గురించి కంపెనీలకు వివరించారు. దీంతో రాష్ట్రం వైపు కంపెనీల దృష్టి పడింది. అయితే తాజాగా రాజేశ్ ఎక్స్పోర్స్ట్ కంపెనీ 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







