తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

- June 12, 2022 , by Maagulf
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందుకు వస్తున్నాయి. తాజాగా 24వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ కంపెనీ ముందుకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌ అమోలెడ్ డిస్‌ప్లేలు తయారీలో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఇన్వెస్ట్‌ చేయనుంది. కంపెనీతో ఎంఓయూ చేసుకున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చరిత్రలో నిలిచిపోయే రోజంటూ ట్విట్ చేశారు.

తెలంగాణలో ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీల దృష్టిని హైదరాబాద్ ఆకర్షిస్తోంది. ఇప్పటికే దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి కేటీఆర్ పలు కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.

దావోస్‌లో మంత్రి కేటీఆర్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సహకారం గురించి కంపెనీలకు వివరించారు. దీంతో రాష్ట్రం వైపు కంపెనీల దృష్టి పడింది. అయితే తాజాగా రాజేశ్‌ ఎక్స్‌పోర్స్ట్‌ కంపెనీ 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com